తల్లిదండ్రుల నిర్లక్ష్యమే.. | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రుల నిర్లక్ష్యమే..

Jun 22 2026 12:30 AM | Updated on Jun 22 2026 12:30 AM

తల్లిదండ్రుల నిర్లక్ష్యమే..

పిల్లలు యుక్త వయస్సుకు వచ్చే సమయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. వారితో ఎక్కవ సమయం గడుపుతూ.. మంచి, చెడు విషయాల గురించి చర్చించాలి. చదువుకుంటే సమాజంలో వారికుండే గౌరవం, భవిష్యత్‌ గురించి వివరించాలి. చదువు పేరుతో వారిపై ఒత్తిడి చేయకుండా స్నేహపూర్వకంగా మెలిగి సరైన సూచనలు ఇవ్వాలి. తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి గురైన పిల్లలే ఎక్కువగా నేరాల బాట పడుతున్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల్లో నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. తప్పులు ఎవరూ చేసినా పోలీస్‌ శాఖ కఠినంగానే వ్యవహరిస్తుంది. మైనర్లకు ఎలాంటి మినహాయింపులు ఉండవు.

– శ్రీనివాసరావు, ఎస్పీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement