పేదల సొంతింటి కల సాకారం | - | Sakshi
Sakshi News home page

పేదల సొంతింటి కల సాకారం

Jun 22 2026 12:30 AM | Updated on Jun 22 2026 12:30 AM

మల్దకల్‌/కేటీదొడ్డి: పేదలకు సొంతింటి కలను నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మల్దకల్‌ మండలంలోని నీలిపల్లి, కేటీదొడ్డి మండలంలోని ఈర్లబండ గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న ఇందిర మ్మ గృహ ప్రవేశాలకు ముఖ్య అతి థిగా హాజరై ప్రారంభించారు. ఇల్లు ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. అర్హులైన పేదలందరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గద్వాల నియోజకవర్గంలో మొదటి విడతలో 3500 ఇళ్లు మంజూరు కాగా.. 2 వేల ఇళ్లు వివిధ ద శల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, త్వర లో వాటి పనులు పూర్తి చేసుకుని గృహ ప్రవేశం చేసుకోనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కానీ వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెండో విడతలో అర్హు లందరికీ కేటాయిస్తామన్నారు. మల్దకల్‌ మండలంలోని దాసరపల్లిలో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం గ్రామ దేవత అయిన సవారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజారెడ్డి, చక్రధర్‌రెడ్డి, విష్ణు, ప్రవీణ్‌, ఆంజనేయులు, ఏలేష్‌, శేఖర్‌రెడ్డి, మధురెడ్డి, పరశురాముడు, భరత్‌రెడ్డి, అమరేష్‌, గోపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement