స్టేషన్ మహబూబ్‌నగర్: ది పాలమూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ వాటాదారులు, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు బ్యాంక్ చైర్మన్ కండె కుమారస్వామి అన్నారు. ది పాలమూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ 28వ సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించారు. బ్యాంక్ చైర్మన్ కుమారస్వామి మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్ రూ.1,29,68,995 లాభాలు ఆర్జించిందని చెప్పా రు. ఇందులో వాటాదారులకు 25 శాతం డివిడెండ్ ఇవ్వాలని నిర్ణయించామని సీనియర్ వైస్ చైర్మన్ గుండ్ల కృష్ణయ్య ప్రకటించారు. తెలంగాణలో 25 శాతం డివిడెండ్ ఇస్తున్న ఏకై క కోఆపరేటివ్ బ్యాంక్ మనదేనని పేర్కొన్నారు. సీఓఈ రాచూరి రాజేంద్రకుమార్ 2025–26 సంవత్సరానికిగాను జమ అయిన ఖర్చుల వివరాలను సమా వేశంలో వివరించగా సభ్యులందరూ ఆమోదం తెలిపారు. 28 ఏళ్ల తర్వాత బ్యాంక్ సొంత భవన నిర్మాణానికి స్థలం కొనుగోలు చేయనున్నామని, అలాగే 2026– 27 ఆర్థిక సంవత్సరంలో మరో నూతన శాఖను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు డైరెక్టర్లు వెల్లడించారు. సమావేశంలో బ్యాంక్ వైస్ చైర్మన్ కలకొండ సూర్యనారాయణ, డైరెక్టర్లు పుల్లా శ్రీనివాసులు, గుండా వెంకటేశ్వర్లు, రాగిరి తిరుపతయ్య, ఎదిర తమ్మయ్య, కల్వ కన్నయ్యశెట్టి, నీల సంగమేశ్వర్, హకీమ్ విశ్వప్రసాద్, దామరగిద్ద జ్యోతి, బ్యాంక్ మేనేజర్ జనుంపల్లి రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.


