గద్వాల క్రైం: వివిధ సమస్యలపై పోలీస్‌స్టేషన్‌కు వ చ్చే బాధితులపై సిబ్బంది స్నేహపూర్వకంగా ఉంటూనే.. నేరస్తులపై కఠినంగా వ్యవహరించాలని ఎ స్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం డీఎస్పీ మొగిలయ్యతో కలిసి గద్వాల పట్టణ పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసుల దర్యాప్తులో పురోగతిని తెలుసుకున్నారు. పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదులపై వేగవంతగా విచారణ చేపట్టి, బాధితులకు పోలీసుశాఖపై నమ్మకం పెంచాలని సూచించారు. జిల్లాకేంద్రంలోని అన్ని కాలనీల్లో గస్తీ, పెట్రోలింగ్‌ను ము మ్మరం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, చోరీ లు, సైబర్ క్రైం, మహిళలపై వేధింపులు, దాడులు, మిస్సింగ్ కేసుల అంశాలపై ప్రత్యేక నిఘా ఉంచి.. నివారణకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. పూర్తి సాక్ష్యాధారాలతో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలుచేసి, నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలన్నారు. డయల్ 100 కాల్స్ విషయంలో త్వరగా స్పందించాలని తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. వారి వెంట సీఐ శ్రీను, ఎస్‌ఐలు కళ్యాణ్‌కుమార్, జహంగీర్, కుమార్ ఉన్నారు.
వేరుశనగ క్వింటా రూ.7,239
గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు గురువారం 1022 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 7,239, కనిష్టంగా రూ. 3,066,సరాసరి రూ. 6,199 ధరలు పలికాయి.
ఆర్టీసీ డీఎంగా
బాధ్యతల స్వీకరణ
గద్వాల క్రైం: జిల్లాకేంద్రమైన గద్వాల ఆర్టీసీ డిపో మేనేజర్‌గా శ్రీధర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారిస్తామని.. బస్టాండ్‌లో మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించి, ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తామన్నారు. అనంతరం పలు కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు డీఎంను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
రాష్ట్ర మహాసభలకు
తరలిరండి
గద్వాల క్రైం: మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలో ఈ నెల 20 నుంచి 22 వరకు నిర్వహించే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 4వ రాష్ట్ర మహాసభలకు కర్షక, కార్మికులు అధిక సంఖ్యలో తరలిరావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.వెంటకస్వామి కోరారు. గురువారం గద్వాల మండలం గోనుపాడులో వ్యవసాయ, ఉపాధి హామీ కూలీలతో ఆయన సమావేశమై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ తీరని అన్యాయం చేస్తున్నాయన్నారు. రాష్ట్ర మహాసభల్లో భవిష్యత్ కార్యాచరణ రూపాందించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని కర్షక, కార్మికులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో వీవీ నర్సింహ, ఉప్పేరు నర్సింహ పాల్గొన్నారు.
జూరాలకు
కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. గురువారం సాయంత్రం వరకు 1,473 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమైన లిఫ్టు –1 గూడ్డెందొడ్డి పంప్‌హౌజ్ మోటార్ల ద్వారా రిజర్వాయర్లకు నీటి పంపింగ్ చేస్తున్నారు. నెట్టెంపాడుకు 1,500 క్యూసెక్కులు, భీమా లిప్టు–1కు 1,192 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 43 క్యూసెక్కులతో కలిపి మొత్తం 2,735 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.682 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.


