గట్టు/ధరూరు: పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అడిషనల్ కలెక్టర్ నర్సింగ్‌రావు అన్నారు. వనమహోత్సవంలో భాగంగా గురువారం ముసంపల్లి రిజర్వు ఫారెస్టులో డీఆర్డీఓ ముషాహిదా బేగం, ఫారెస్టు రేంజర్ ఫర్వేజ్ అహ్మద్‌లతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ తరాల కు స్వచ్ఛమైన వాతావరణం అందించాలనే లక్ష్యంతో వనమహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అ డవులు పెరిగితేనే వర్షాలు సమృద్ధిగా కురిసి అందరికీ మేలు చేకూరుతుందన్నారు. ప్రతి ఒక్కరూ విధి గా మొక్కలు నాటి పెంచాలని కోరారు. అదే విధంగా ధరూరు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాఠశాల పరిసరాలతో పాటు మధ్యాహ్న భోజనం, వంట గది, మరుగుదొడ్లు, వసతి సౌకర్యం, తరగతి గదు లు, తాగునీటి సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థినులకు మెరుగైన విద్య అందించడంతో పాటు అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమాల్లో ఎస్‌ఓ గోమతి, డీఆర్వో జాకిరుద్దీన్, సుమలత, ఎఫ్‌ఎస్‌ఓ ప్రసూన మన్యమయ్య, ఎఫ్‌బీఓ శ్వేత, ఎంపీడీఓ చెన్నయ్య, సర్పంచ్ సాకే డేవిడ్, ఉపసర్పంచ్ బాసు గోపాల్ పాల్గొన్నారు.


