ఎర్రవల్లి: ఉచిత హామీల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెడుతున్నాయని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు మణికుమార్ విమర్శించారు. బుధవారం ఎర్రవల్లిలో ఏర్పాటుచేసిన ఆ పార్టీ ఉమ్మడి ఇటిక్యాల మండలస్థాయి సమావేశానికి ఆయన హాజరై మహానీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజల్లో సామాజిక పరివర్తన తీసుకురావడానికి కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. దేశంలో విద్యారంగ అభివృద్ధికి కృషిచేసిన మహాత్మా పూలే దంపతుల త్యాగాన్ని, దేశానికి రాజ్యాంగాన్ని అందించిన డా.బీఆర్ అంబేడ్కర్ భావాజాలాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఓటు చైతన్యంతో ప్రజల్లో సామాజిక పరివర్తన తీసుకొచ్చి, పార్టీని బలోపేతం చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. సమావేశంలో రాంబాబు, నగే శ్, శాంతిరాజు, జీవన్, బొజ్జన్న, సురేశ్, రామకృష్ణ, హుస్సేన్, యువరాజు ఉన్నారు.


