జిల్లాలో ముగ్గురు వ్యాపారులు నల్లన్న, కురుమన్న, శ్రీనివాస్‌రెడ్డి వడ్డీ వ్యాపారం పేరుతో సామాన్య ప్రజలు, రైతులు, ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పెట్టుబడులు తీసుకున్నారు. వారి మాటలు నమ్మి సుమారు 377 మంది సభ్యులు డబ్బులను పొదుపు చేసుకున్నారు. ఇలా మొత్తం రూ. 50కోట్లు వసూలుచేసి.. పెట్టుబడులు పెట్టిన వారికి తిరిగి డబ్బులు చెల్లించకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. చెల్లించిన వారి నుంచి ఒత్తిడి, దాడులు, బెదిరింపులు ఇతరత్రా వంటి వాటి నుంచి తప్పించుకునేందుకు ఐపీ పెట్టారు.
క్రిమినల్ కేసులు నమోదు..
జిల్లాలోని పలువురు వ్యక్తులు వడ్డీ వ్యాపారం, చిట్‌ఫండ్ పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలుచేసి, మోసం చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలాంటి వ్యాపారంచేసే వ్యక్తుల వద్ద పెట్టుబడులు పెట్టొద్దు. తెలిసిన వ్యక్తే కదా అని నమ్మితే చివరకు మోసపోవడానికి దారి తీస్తుంది. అనుమతి లేకుండా ఎక్కడైనా వడ్డీ వ్యాపారం, చిట్‌ఫండ్ నిర్వహిస్తున్నట్లు తెలిస్తే పోలీసుశాఖకు సమాచారం అందించాలి. అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, ఎస్పీ
●


