అలంపూర్ రూరల్: మద్యం అమ్మకాలు చేపట్టడానికి వేలం పాటలు నిర్వహించే ప్రస్తుత పరిస్థితుల్లో.. మండలంలోని గొందిమల్ల గ్రామస్తులు మాత్రం మద్యం అమ్మకాలు నిషేధిస్తూ తీర్మానం చేశారు. గొందిమల్లలో మద్యం అమ్మితే రూ.90 వేల జరిమానా విధించాలని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మంగళవారం తీర్మానం చేసినట్లు పంచాయతీ కార్యదర్శి జరీనా తెలిపారు. గ్రామంలో మద్యం అమ్మకాలు నిషేధిస్తూ.. బెల్ట్‌షాపులు లేకుండా పంచాయతీ పాలక మండలి తీర్మానం చేసిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పుష్పలత, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


