కమీషన్ల కోసమే కొడంగల్‌ ఎత్తిపోతల పథకం | - | Sakshi
Sakshi News home page

కమీషన్ల కోసమే కొడంగల్‌ ఎత్తిపోతల పథకం

Jun 16 2026 12:58 AM | Updated on Jun 16 2026 12:58 AM

కొడంగల్‌ ప్రజలకై నా వందశాతం హామీలు అమలు చేయాలి

మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

కోస్గి రూరల్‌: పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.5,000 కోట్ల నిధులను కేటాయిస్తే కొడంగల్‌ నియోజకవర్గంలోని 1.50లక్షల ఎకరాలకు కాల్వల ద్వారా సాగునీరు సాధించవచ్చని, అలా చేయుకండా కమీషన్ల కోసమే నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతల పథకం చేపట్టారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం కోస్గిలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హమీలలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌, దళితబంధు రూ.12 లక్షలు, రైతు భరోసా రూ.15 వేలు, వందశాతం రుణమాఫీలను కనీసం ఓటేసి గెలిపించిన కొడంగల్‌ నియోజకవర్గ ప్రజలకై న వందశాతం పూర్తి చేసి చూపించాలన్నారు. జూరాల ప్రాజెక్టులో నీరు లేదనే క్రాప్‌ హలిడే ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అదే జూరాల నుంచి కొడంగల్‌ ప్రజలకు సాగునీరు అందిస్తానని చెప్పి ప్రజలను మరోమారు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 2034 వరకు సీఎం నేనే అంటూ ప్రగల్బాలు పలకడం మానుకోవాలని, రాబోయే 2028 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి సింగల్‌ డిపాజిట్‌ రాదని, సీఎంగా రేవంత్‌ దిగిపోవడం ఖాయమన్నారు. కోస్గి మున్సిపాలిటీలో అండర్‌ డ్రెయినేజీ, తాగునీటి సరఫరా పనులలో జాప్యం చేస్తున్నారని అన్నారు. నాయకులు వెంకట్‌నర్సిములు, జనార్దన్‌రెడ్డి, నీలప్ప, సాయిలు, నరేందర్‌రెడ్డి, వెంకట్‌, శ్రీశైలం తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement