అయిజ సమీపంలోని పెద్దవాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించేందుకు గతేడాది రూ.18 కోట్ల అంచనాతో ఆర్‌అండ్‌బీ ఈఈ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ, ఇంత వరకు నిధులు మంజూరు కాలేదు. అదేవిధంగా నాలుగు కల్వర్టులు పునర్ నిర్మించేందుకు 2024లో రూ.3 కోట్లు మంజూరైనా పనులు ప్రారంభించలేదు.
– నజీర్, అయిజ
మరమ్మతు చేపట్టాలి..
క్షతగాత్రులకు అత్యవసర సేవలందించేందుకు ఎక్కువగా అంబులెన్స్‌లు గద్వాల జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రితోపాటు కర్నూలుకు తీసుకెళ్లాల్సి వస్తుంది. కానీ, ఇక్కడి కాజ్‌వే పూర్తిగా దెబ్బతినడంతో రోడ్డుపై వేగంగా వెళ్లలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సకాలంలో ఆస్పత్రికి చేరుకోలేక ప్రాణాల మీదకు వస్తుంది. హైలెవల్ బ్రిడ్జి నిర్మించి, కల్వర్టులలకు మరమ్మతు చేస్తే బాగుంటుంది. – తిరుమలేష్, 108 సిబ్బంది
ప్రతిపాదనలు పంపించాం..
అయిజ పెద్దవాగుపై శిథిలమైన కాజ్‌వేను తొలగించి హైలెవల్ బ్రిడ్జి నిర్మించేందుకు గతేడాది రూ.18 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. ఆర్థిక సంవత్సరం ముగియడంతో మళ్లీ ఈసారి కొత్తగా పంపించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ ప్రక్రియ పూర్తయి నిధులు విడుదలైతేనే హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభిస్తాం. అలాగే నాలుగు కల్వర్టులు నిర్మించేందుకు 2024లో రూ.3 కోట్లు మంజూరయ్యాయి. టెక్నికల్ డ్రాయింగ్ అప్రూవల్‌కు పంపాం.
– అల్తాఫ్, ఆర్‌అండ్‌బీ ఏఈ
●


