కలెక్టర్‌కు తమ సమస్య విన్నవిస్తున్న రైతులు
అలంపూర్ : మున్సిపాలిటీలో పన్నులు సకాలంలో చెల్లించాలని కమిషనర్ చంద్రశేఖర్ రావు అన్నారు. అలంపూర్‌లో వార్డు అధికారులతో కలిసి కమిషనర్ సోమవారం దుకాణదారుల వద్ద పన్ను వసూలు చేశారు. నివాసగృహ యజమానులు, దుకాణదారులు పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని అన్నారు. అధిక మొత్తంలో బకాయిలు ఉన్న వారికి నోటీసులు అందించనున్నట్లు, పెండింగ్‌లో ఉన్న వారందరూ వెంటనే పన్నులు చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వార్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.