చిట్యాల: ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి నిష్పక్షపాతంగా సేవలు అందించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్, చిట్యాల సర్కిల్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీలో భాగంగా సందర్శించారు. పెండింగ్ కేసులు, సీసీటీఎన్‌ఎస్, బ్లూకోల్ట్స్, సీసీ కెమెరాల పని తీరుపై సమీక్షించారు. వనమహోత్సవంలో భాగంగా స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధి సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు నిరంతరం పని చేసేలా పర్యవేక్షించాలని, లోపాలు ఉన్న కెమెరాలను వెంటనే మరమ్మతు చేయించాలని అధికారులను ఆదేశించారు. రిసెప్షన్‌కు వచ్చే ప్రతీ ఫిర్యాదును వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసి దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు సీసీటీఎన్‌ఎస్‌లో నవీకరించాలని సూచించారు. రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా కొనసాగిస్తూ, ప్రజలకు స్నేహపూర్వకంగా, పారదర్శకంగా సేవలు అందించాలని ఎస్పీ కోరారు. కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, సీఐ మల్లేష్, ఎస్సై పోచంపల్లి సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
భూపాలపల్లి: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా డీఎఫ్‌ఓ కిష్టగౌడ్‌తో కలిసి జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో మంగళవారం మొక్కలు నాటారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలని సూచించారు. కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ బుర్ర కొమురయ్య, మున్సి పల్ కమిషనర్ ఉదయ్‌కుమార్, అడిషనల్ ఎస్పీ నరేష్‌కుమార్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


