నాటు బాంబులు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

నాటు బాంబులు స్వాధీనం

Aug 25 2026 12:57 AM | Updated on Aug 25 2026 12:57 AM

రేగొండ: ఇద్దరు వ్యక్తుల నుంచి నాటు బాంబులు స్వాధీనం చేసుకుని అరెస్ట్‌ చేసినట్లు ఎస్సై సుధాకర్‌ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని భాగిర్థిపేట ఆర్చ్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి మండలంలోని భాగిర్థిపేట గ్రామానికి చెందిన పసునూటి రమేష్‌, దేవరకొండ సారంగం పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని పట్టుకుని తనిఖీ చేయగా వారి వద్ద ఐదు నాటు బాంబుల లభించాయి. గణ పురం మండలం బుర్రకాయలగూడెం గ్రామానికి చెందిన బుర్ర మల్లయ్య వద్ద అడవి పందుల వేట కోసం కొనుగోలు చేసినట్లు తెలి పారు. వాటిని గూడెపల్లి శివారులోని రాజనర్సయ్య వ్యవసాయ భూమి సమీపంలోని అటవీ ప్రాంతంలో అమర్చినట్లు తెలిపారు. ఈ నెల 22న గూడెపల్లి గ్రామానికి చెందిన గుండె స్వర్ణలత వ్యవసాయ భూమిలో కలుపు తీస్తుండగా కొడవలి తాకి బాంబు పేలి గాయాలు కాగా మిగతా బాంబులను చెరువులో పడేయడానికి తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement