● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి: పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. కొత్తగా ఎన్నికై న జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసో సియేషన్ కార్యవర్గ సభ్యులు సోమవారం ఎస్పీ సంకీర్త్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను ఎస్పీ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
నూతన కార్యవర్గ వివరాలు..
జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికలు సోమవారం జరుగగా అధ్యక్షుడిగా గుగులోత్ నరేష్, ఉపాధ్యక్షుడిగా మహదేవపూర్ సీఐ ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్సై మచ్చ సాంబమూర్తి, కార్యదర్శిగా గణపురం ఎస్సై బి.అశోక్, జాయింట్ సెక్రటరీలుగా కానిస్టేబుల్ ఎ.రమేష్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా కానిస్టేబుల్ ఎ.సతీష్, కోశాధికారిగా చిన్నన్న, కార్యవర్గ సభ్యులుగా బి.సతీష్, డి.శ్రావణ్, పి.విజయ్, ఎం.అంబిక, ఎం.యాదిరెడ్డి, క్రాంతిలను ఎన్నుకున్నారు.
బాధితులకు త్వరితగతిన న్యాయం
బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ సంకీర్త్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 15 ఫిర్యాదులను స్వీకరించి పరిశీలించారు. భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక మోసాలు ఇతర పోలీస్ సంబంధిత అంశాలపై వచ్చిన ప్రతి వినతిని ఎస్పీ ఓర్పుగా విన్నారు. సంబంధిత పోలీస్ అధికారులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


