● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
రేగొండ: నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. మంగళవారం మండలంలోని పోలీస్‌స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు ప్రజల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సంపత్‌రావు, గణపురం సీఐ కరుణాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.


