కాళేశ్వరం: ప్రభుత్వ పథకాలు, వనరులను సమర్థవంతంగా వినియోగించుకొని గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ప్రాజెక్టు మానిటరింగ్ అధికారి కౌసల్యా దేవి సూచించారు. మంగళవారం అదనపు కలెక్టర్ విజయలక్ష్మితో కలిసి మహదేవపూర్ మండలం ఎడపల్లి గ్రామపంచాయతీని సందర్శించారు. ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రెయినేజీ, విద్య, ఆరోగ్యం, ఉపాధి, నీటి సంరక్షణ, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ అంశాలను పరిశీలించారు. గ్రామ అవసరాలను గుర్తించి, ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని అధికారులకు తెలిపారు. అనంతరం ఎడపల్లి గ్రామపంచాయతీలో విబిజి రాంజీ పథకం కింద ఫాంపాండ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ బాలకృష్ణ, అదనపు డీఆర్‌డీఓ సురేష్, డీఎల్‌పీఓ మల్లికార్జున్‌రెడ్డి, ఎంపీడీఓ రవీంద్రనాథ్, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి రాధిక, ఏపీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎడపల్లి సర్పంచ్ మోతే నీలారాణి, ఉపసర్పంచ్ గోగుల కృష్ణ, పంచాయతీ కార్యదర్శి మహేశ్, ఫీల్డ్ అసిస్టెంట్ రాజశేఖర్ పాల్గొన్నారు.


