భూపాలపల్లి అర్బన్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మొబైల్ వ్యాన్ ద్వారా మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు, ఖాసీంపల్లి గ్రామాల్లో సోమవారం న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పుప్పాల శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉచిత న్యాయ సహాయం అవసరమైన వారు, కోర్టు కేసుల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. ప్రామిసరీ నోట్ వివాదాలు, కుటుంబ వివాదాలు, సివిల్ కేసులు తదితర సమస్యల్లో ఉన్నవారు ఉచిత న్యాయ సహాయాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. పరస్పర సోదరభావంతో వివాదాలకు దూరంగా జీవించాలని పిలుపునిచ్చారు. న్యాయ సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 15100ను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది అంబాల దేవేందర్, వెంకటేష్, రాజ్‌కుమార్, గౌతమి పాల్గొన్నారు.


