భూపాలపల్లి అర్బన్: ఉద్యోగ జీవితంలో బదిలీ సహజం అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జే.జీవన్‌కుమార్ తెలిపారు. నిజామాబాద్ కోర్టుకు బదిలీ అయిన జిల్లా కోర్టు అడ్మినిస్ట్రేటివ్ అధికారి జి.అనితవాణికి సోమవారం జిల్లా కోర్టులో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జీవన్‌కుమార్ మాట్లాడుతూ.. ఎక్కడ ఉన్నా ఆయురారోగ్యాలతో, విధులపట్ల నిబద్ధతతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏదులాపురం శ్రీనివాస్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఇందారపు శివకుమార్, న్యాయవాదులు వెంకటస్వామి, అబ్దుల్‌కలాం, సూపరింటెండెంట్‌లు రఘురాం, సదానందం, సీనియర్ అసిస్టెంట్ సురేందర్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి
జీవన్ కుమార్


