ఆదివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2026

Aug 16 2026 5:15 AM | Updated on Aug 16 2026 5:15 AM

భూపాలపల్లి అర్బన్‌: అభివృద్ధి, సంక్షేమమే ప్రజాప్రభుత్వం లక్ష్యమని.. తెలంగాణ రైజింగ్‌–2047 విజన్‌తో రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాటల్లోనే..

223 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు భూ భారతి చట్టాన్ని అమలు చేస్తున్నాం. జిల్లాలోని 223 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి 53,763 దరఖాస్తులు స్వీకరించాం. 70 గ్రామాల్లో భూముల రీ–సర్వేకు చర్యలు చేపట్టగా, 7 మండలాల్లోని 15 గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయి.

జిల్లాకు 4,586 ఇందిరమ్మ ఇళ్లు

జిల్లాకు 4,586 ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకాగా 797 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. 3,789 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఇందుకోసం ఇప్పటివరకు రూ.87.04 కోట్లు మంజూరు చేశాం.

రైతు సంక్షేమానికి ప్రాధాన్యం

50 శాతం రాయితీతో 135 మంది రైతులకు రూ.77.56 లక్షల విలువైన పరికరాలు అందించాం. 29,683 మంది రైతులకు రూ.299.34 కోట్ల రుణమాఫీ చేశాం. 271 మంది మరణించిన రైతుల కుటుంబాలకు రైతుబీమా కింద రూ.13.55 కోట్లు అందించాం. రైతు భరోసా కింద 1,27,151 మంది రైతులకు రూ.144.93 కోట్ల పెట్టుబడి సాయం అందించాం.

పేదల ఆహార భద్రతకు ప్రాధాన్యం

జిల్లాలో 1,39,530 రేషన్‌ కార్డుల్లో 3,95,964 మంది సభ్యులు ఉన్నారు. వారికి ప్రతి నెలా 2,564 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నాం. ఇప్పటివరకు 17,301 నూతన రేషన్‌ కార్డులు మంజూరు చేశాం.

అలరించిన సాంస్కృతిక

కార్యక్రమాలు

సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు దేశభక్తి గీతాలతో చేపట్టిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి, ఉత్తమసేవలు అందించిన అధికారులు, సిబ్బంది, సాంస్కతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. సమాచార పౌర సంబంధాల శాఖ, డీఆర్‌డీఏ, సంక్షేమ, వ్యవసాయ, ఉద్యాన, వైద్య ఆరోగ్య శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్‌, విజయలక్ష్మి, డీఆర్వో వసంతకుమారి, ఆర్డీఓలు హరికృష్ణ, రవీందర్‌, శిక్షణ డిప్యూటీ కలెక్టర్‌ నవీన్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజాబాబు, మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమురయ్య, వైస్‌ చైర్మన్‌ అంబాల శ్రీనివాస్‌, కౌన్సిలర్లు, జిల్లా అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

పేదల సొంతింటి కల సాకారం

భూ భారతితో సమస్యల పరిష్కారం

ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement