అర్హులందరికీ సంక్షేమ పథకాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

Aug 16 2026 5:15 AM | Updated on Aug 16 2026 5:15 AM

భూపాలపల్లి రూరల్‌: అర్హులందరికీ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నవంబర్‌ నుంచి రేషన్‌ కార్డు కలిగిన కుటుంబాలకు రూ.5 లక్షల ప్రమాద బీమా అమలు చేయనున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ డూప్లికేట్‌ చేయడానికి వీలు లేని విధంగా 9 రకాల అత్యాధునిక భద్రతా ఫీచర్లతో నూతన డిజిటల్‌ స్మార్ట్‌ రేషన్‌ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌, ఆరోగ్యశ్రీ, స్కాలర్‌షిప్‌ తదితర ప్రభుత్వ సేవలు, పథకాలలో గుర్తింపు కార్డుగా ఉపయోగపడే విధంగా రూపొందించినట్లు తెలిపారు. కలెక్టర్‌ రాహుల్‌శర్మ మాట్లాడుతూ స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకత, భద్రత, సౌలభ్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, ఆర్డీఓ హరికృష్ణ, పౌర సరఫరాల అధికారి కిరణ్‌కుమార్‌, పోలీస్‌ బోర్డ్‌ సభ్యుడు రామనరసింహా రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజబాబు, మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమురయ్య, వైస్‌ చైర్మన్‌ అంబాల శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ అప్పం కిషన్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement