కాళేశ్వరాలయంలో శ్రావణ శోభ | - | Sakshi
Sakshi News home page

కాళేశ్వరాలయంలో శ్రావణ శోభ

Aug 16 2026 5:15 AM | Updated on Aug 16 2026 5:15 AM

శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి బాలాలయం, అనుబంధ దేవాలయమైన శ్రీఆదిముక్తీశ్వరాలయంలో శ్రావణమాసం సందర్భంగా శనివారం భక్తుల సందడి నెలకొంది. తెలంగాణ, మహారాష్ట్రతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ముందుగా త్రివేణిసంగమ గోదావరిలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించి సైకత లింగాలకు మొక్కారు. గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలాలయంలో శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కాలసర్ప, శనిపూజలు నిర్వహించారు. కుంకుమార్చనలు చేశారు. లక్షవత్తులు వెలిగించారు. దీంతో భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. – కాళేశ్వరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement