మొగుళ్లపల్లి: కేసుల పరిష్కారానికి రాజీమార్గమే ఉత్తమమని డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కంప అక్షయ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని బస్టాండ్, రైతు వేదికలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సును మొబైల్‌వ్యాన్‌ను ఉపయోగించి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా కంప అక్షయ మాట్లాడుతూ ఉచిత న్యాయ సహాయం పొందేవారు, కోర్టు కేసుల్లో చిక్కి ఇబ్బందులు పడేవారు, న్యాయాన్ని పొందలేని నిస్సహాయులు, ప్రామిసరీ నోట్ వివాదాలు, కుటుంబ వివాదాలు, సివిల్ కేసుల్లో చిక్కుకొని ఇబ్బందులు పడేవారు జిల్లా న్యాయ సేవధికార సంస్థను సంప్రదించాలని తెలిపారు. కేసుల్లో రాజీ మార్గాన్ని పాటించి పరిష్కారం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివాదాలు లేని సోదరాభావంతో జీవించాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ రఘురామ్, మొగుళ్లపల్లి ఎంపీడీఓ సురేందర్, సర్పంచ్ చాట్ల విజయ రవీందర్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది అంబాల దేవేందర్, కె.వెంకటేష్, ఎం.రాజ్‌కుమార్, పారాలీగల్ వాలంటీర్లు మంగళపల్లి శ్రీనివాస్, బండారి రామస్వామి, తిరుపతి, రమేశ్ పాల్గొన్నారు.


