చిట్యాల: మండలంలోని గ్రామాలలో వివిధ కేసులలో ఉన్న వారికి న్యాయం జరిగేందుకు రాజీమార్గమే ఉత్తమమని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పుప్పాల శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం మండలకేంద్రంలో జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో మొబైల్ వ్యాన్ సేవలకోసం కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ వద్ద గ్రామస్తులకు న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమస్యలు తలెత్తినప్పుడు రాజీ లేదా మధ్యవర్తిత్వం ఉత్తమమైనదని అన్నారు. డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కె.అక్షయ, సూపరింటెండెంట్ రాఘురామ్ మాట్లాడుతూ మీడియేషన్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్ ఆరెపల్లి తిరుపతి, వార్డు సభ్యులు తౌటం నవీన్, చందు, తదితరులు పాల్గొన్నారు.
చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్
పుప్పాల శ్రీనివాస్


