కొమురం భీం ఆశయాలే స్ఫూర్తి | - | Sakshi
Sakshi News home page

కొమురం భీం ఆశయాలే స్ఫూర్తి

Aug 10 2026 1:28 AM | Updated on Aug 10 2026 1:28 AM

ఎమ్మెల్యే సత్యనారాయణ రావు

భూపాలపల్లి రూరల్‌: ఆదివాసీల హక్కుల పరిరక్షణకు కొమురం భీం ఆశయాలే స్ఫూర్తి అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ప్రపంచ ఆదివాసీ హక్కుల దినోత్సవం సందర్భంగా ఆదివారం పట్టణంలోని కొమురంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, జల్‌–జంగల్‌–జమీన్‌ పరిరక్షణ కోసం కొమురం భీం చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఆదివాసీలు డోలు వాయిద్యాలు సాంప్రదాయ నృత్యాలతో జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్‌, భూపాలపల్లి మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు, ఆదివాసీ, తుడుందెబ్బ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement