కలెక్టర్‌ పరిశీలన | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ పరిశీలన

Jun 20 2026 10:38 AM | Updated on Jun 20 2026 10:38 AM

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన ఎంఆర్‌ఐ యంత్రాన్ని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ శుక్రవారం పరిశీలించారు. త్వరలో ఎంఆర్‌ఐ సేవలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. యంత్రం ఏర్పాటు పనులు తుదిదశకు చేరుకున్నాయని, ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎంఆర్‌ఐ యంత్రం అందుబాటులోకి రావడంతో జిల్లాలోనే అధునాతన వైద్యసేవలు ప్రజలకు అందనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అశోక్‌ కుమార్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement