న్యూస్‌రీల్
శనివారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 202
● వానొస్తే ప్రజలకు తిప్పలే..
● మహాముత్తారంలో పరిస్థితి మరీ అధ్వానం
భూపాలపల్లి అర్బన్: పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం.. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం వెరసి జిల్లాలో వంతెనల నిర్మాణాలు సంవత్సరాలుగా సా..గుతూనే ఉన్నాయి. నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రజల రవాణా కష్టాలు ఈ వానాకాలంలోనూ మళ్లీ మొదటికొచ్చేలా ఉన్నాయి. వానాకాలం సీజన్ కావడం శుక్రవారం జిల్లాకేంద్రంలో భారీ వర్షం కురవడంతో మళ్లీ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వాగులు దాటాల్సిందేనా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటుంటే జిల్లా ప్రజల్లో వణుకు మొదలవుతోంది. భారీ వర్షాలు కురిస్తే మహాముత్తారం మండలంలోని ఏజెన్సీ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే ప్రమాదం ఉంది. నిలిచిపోయిన వంతెన నిర్మాణాలు పూర్తయితే భూపాలపల్లి, గణపురం, చిట్యాల, టేకుమట్ల, మహాముత్తారం మండలాల్లో ప్రజలకు రవాణా కష్టాలు తప్పే అవకాశం ఉంది. లేదంటే విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, గర్భిణులు, ప్రజలు ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది.
అసంపూర్తిగా వంతెనల నిర్మాణాలు
ఆగిపోయిన బ్రిడ్జి నిర్మాణం
చిట్యాల: చిట్యాల–భూపాలపల్లి మండలాల మధ్య నైన్‌పాక శివారు మోరంచవాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు 2022లో రూ.7కోట్ల నిధులతో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపనచ ఏశారు. బ్రిడ్జి నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. స్థానికులు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కల్వర్టుపై నుంచి వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. వర్షాలు కురిస్తే మోరంచ ఉప్పొంగి రాకపోకలకు అంతరాయం కలుగనుంది. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే భూపాలపల్లి, మల్హర్, చిట్యాల, టేకుమట్ల మండలాల ప్రజలకు సౌకర్యావంతంగా ఉంటుంది.


