వర్ష బీభత్సం | - | Sakshi
Sakshi News home page

వర్ష బీభత్సం

Jun 20 2026 10:38 AM | Updated on Jun 20 2026 10:38 AM

జిల్లాకేంద్రంలో 2 గంటల పాటు ఎడతెరపి లేని వాన

ఈదురుగాలులతో కూలిన విద్యుత్‌ స్తంభాలు

భూపాలపల్లి: వరుణ దేవుడు ఒక్కసారిగా తన ప్రతాపాన్ని చూపించాడు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉదయమంతా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించాడు. వేడి, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. భారీ ఈదురుగాలులతో సుమారు రెండు గంటల పాటు వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, భారీ ఈదురుగాలులు రావడంతో పట్టణంలో పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో ఎన్పీడీసీఎల్‌ అధికారులు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. వర్షం తగ్గుముఖం పట్టాక విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగిన ప్రాంతాల్లో రాత్రి వరకు మరమ్మతు పనులు చేపట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement