ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య

Jun 20 2026 10:38 AM | Updated on Jun 20 2026 10:38 AM

డీఈఓ రాజేందర్‌

మహాముత్తారం: ప్రభుత్వ బడుల్లోనే అన్ని సౌకర్యాలతో పాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య అందిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్‌ అన్నారు. జయశంకర్‌ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మహాముత్తారం మండలకేంద్రంలోని ఎంపీపీఎస్‌ పాఠశాల ఉపాధ్యాయులు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాబోధన అందిస్తున్నామన్నారు. అనంతరం పాఠశాలలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థులకు బట్టలు పంపిణీ చేశారు. అనంతరం ఎంఈఓ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సాంబశివరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులు, ఎమ్మార్సీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement