టేకుమట్ల: టేకుమట్ల–పెద్దపల్లి జిల్లా ఓడేడ్ ముత్తారం గ్రామాల మధ్య 2016 సంవత్సరంలో అంతర్‌ర్రాష్ట్ర వంతెన నిర్మాణానికి రూ.48 కోట్ల నిధులతో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు శంకుస్థాపన చేశారు. 2021 వరకు పనులు సాగాయి. ఫిల్లర్లు వేసి గడర్లు పెట్టి మధ్యలోనే నిర్మాణ పనులు నిలిపివేశారు. ఓడేడ్, గర్మిళ్లపల్లి గ్రామస్తులు మానేరు వాగులో తాత్కాలిక మట్టి రోడ్డును నిర్మించి రవాణా సాగిస్తున్నారు. వర్షాలు ప్రారంభమైతే తాత్కాలిక మట్టి రోడ్డు ధ్వంసం కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. టేకుమట్ల నుంచి ఓడేడ్ మీదుగా పెద్దపల్లి, గోదావరిఖనికి ప్రయాణించేవారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మీదుగా ప్రయాణిస్తున్నారు. దానివల్ల సుమారు 50 కిలోమీటర్లకు పైగా ప్రయాణం అదనంగా చేయాల్సి వస్తుంది. వర్షాకాలం అయిపోయిక గ్రామస్తులు మళ్లీ రోడ్డు ఏర్పాటుచేసుకుని ప్రతి సంవత్సరం రవాణా సాగిస్తున్నారు. ఈ వానాకాలంలోనూ ప్రజలకు కష్టాలు తప్పేలా లేవు.


