ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
భూపాలపల్లి: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ జిల్లాలోని పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దివస్ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు పైరవీలు, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని అన్నారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


