ఎంపీఎల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఎంపీఎల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

Jan 4 2026 7:01 AM | Updated on Jan 4 2026 7:01 AM

ఎంపీఎ

ఎంపీఎల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలకేంద్రంలోని కాలేజీ గ్రౌండ్‌లో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐదు మండలాల మహదేవపూర్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఎంపీఎల్‌) క్రికెట్‌ టోర్నమెంట్‌ను శనివారం ప్రారంభమైంది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కోట రాజబాబు, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు, సర్పంచ్‌ హసీనభానో ప్రారంభించారు. ఈ సందర్భంగా కోట రాజబాబు మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్రీడా పోటీలు పోలీసులు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు పవన్‌కుమార్‌, సాయిఽశశాంక్‌, తమాషారెడ్డి, రమేష్‌, ఉప సర్పంచ్‌ శ్రీజ పాల్గొన్నారు.

ఐఎన్‌టీయూసీతోనే సమస్యల పరిష్కారం

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణి కార్మికుల సమస్యలు ఐఎన్‌టీయూసీతోనే పరిష్కారమవుతున్నాయని ఆ యూనియన్‌ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జోగు బుచ్చయ్య. పనునూటి రాజేందర్‌ తెలిపారు. ఏరియాలోని కేటీకే 5వ గనిలో శనివారం బ్రాంచ్‌ ఇన్‌చార్జ్‌ ఉపాధ్యక్షుడు బొడ్డు ఆశోక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బాయిబాట కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చర్చించి పలు సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సమ్మిరెడ్డి, రాజు, రాజేష్‌ఠాకుర్‌, రవికిరణ్‌, శ్రీకాంత్‌, అశోక్‌, శ్రీనివాస్‌, సంతోష్‌, వెంకటేశ్‌, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

డీపీఓను కలిసిన ఆపరేటర్లు

మొగుళ్లపల్లి : జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న ఈ పంచాయతీ కంప్యూటర్‌ ఆపరేటర్లు శనివారం జిల్లా పంచాయతీ అధికారి శ్రీలతను కలిశారు. మూడు నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని సమస్యలు వివరించి వినతిప్రతం అందజేశారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని డీపీఓ అన్నారు. డీపీఓను కలిసిన వారిలో సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్‌, తిరుపతి, పవన్‌, శ్రీహరి పాల్గొన్నారు.

వాగ్దానాలను విస్మరించిన సంఘాలు

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణి కార్మికులకు మోసపూరిత వాగ్దానాలు చేసి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపొందిన గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు కార్మికులను మోసం చేశారని సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నర్సింహరావు ఆరోపించారు. ఏరియాలోని యూనియన్‌ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన హమీలను ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ విఫలమైనట్లు ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంపేటి రాజయ్య, వివిధ ఏరియాల నాయకులు రమేష్‌, సారయ్య, శివరెడ్డి, శషి, కిరణ్‌, సాగర్‌, అజయ్‌, నరహరి, బాబురావు, శ్రీనివాస్‌, ప్రసాద్‌, కిరణ్‌లు పాల్గొన్నారు.

టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

భూపాలపల్లి అర్బన్‌: హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలోని సంస్కృతిక విహార్‌లో ఏర్పాటుచేస్తున్న మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణను ఉమ్మడి వరంగల్‌ జిల్లా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌బీఐ ఆర్‌ఎస్‌ఈటీఐ ఇన్‌చార్జ్‌ కిశోర్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల మహిళలు ఈ నెల 5లోపు విద్యార్హత, రేషన్‌కార్డు, ఆధార్‌, పాన్‌కార్డు జిరాక్స్‌లతో సంప్రదించాలన్నారు.

ఎంపీఎల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం
1
1/1

ఎంపీఎల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement