ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, చిట్యాల సీహెచ్‌సీల్లో సౌకర్యాలు కల్పించాలని శాసనమండలిలో మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి కోరారు. శాసన మండలి సమావేశాల్లో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఆస్పత్రులను సందర్శించి రోగులు, డాక్టర్లతో మాట్లాడినట్లు తెలిపారు. డాక్టర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ సౌకర్యాలు లేవన్నారు. పారామెడికల్ సిబ్బందిని నియమించాలని కోరారు. నాణ్యమైన వైద్యసేవలు లేకపోవడంతో ఓపీ సంఖ్య తగ్గిపోయిందన్నారు. పేషెంట్ కేర్, శానిటేషన్ సక్రమంగా లేదని, ల్యాబ్ అప్‌గ్రేడ్ చేయాలని, 10మంది సీఎంఓ, ఆర్‌ఎంఓలు ఉండాల్సి ఉండగా ఒక్క ఆర్‌ఎంఓ మాత్రమే ఉన్నారన్నారు. మెడికల్ కళాశాలలో సరైన తరగతి గదులు, ల్యాబోరేటరీలు లేవని అన్నారు. 30శాతం సౌకర్యాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. కరోనా తరువాత అనారోగ్య సమస్యలు అఽధికంగా వస్తున్న నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చాలని అవసరం ఉందని కోరారు.
శాసనమండలిలో మండలి ప్రతిపక్ష నేత
మధుసూదనాచారి


