పట్టణ అభివృద్ధికి సింగరేణి సహకరించాలి
భూపాలపల్లి అర్బన్: పట్టణ అభివృద్ధికి సింగరేణి యాజమాన్యం సహకరించాలని భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్ కోరారు. పట్టణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై శుక్రవారం ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి తన కార్యాలయంలో కమిషనర్, సిబ్బందితో చర్చించారు. కమిషనర్ ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ సింగరేణి నుంచి మున్సిపల్‌కు రావాల్సిన ఆస్తి పన్నును చెల్లించాలని కోరారు. పట్టణ అభివృద్ధికి సహకారం అందించాలన్నారు. త్వరలోనే వార్డుల వారీగా అధికారులతో కలిసి పర్యవేక్షణ చేస్తామని జీఎం తెలిపారు.
మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్


