శనివారం శ్రీ 3 శ్రీ జనవరి శ్రీ 2026
మహాజాతరలో మెరుగైన వైద్యసేవలు
నిత్యం రూ.లక్షల్లో పక్కదారి..
న్యూస్‌రీల్
మూడు క్వారీల్లో..
● లారీడ్రైవర్ల వద్ద రూ. 2వేల నుంచి
రూ.3వేల వరకు వసూలు
● చోద్యంచూస్తున్న
అధికారులు
ఇసుక క్వారీలో లోడింగ్
కాళేశ్వరం: ప్రభుత్వం నిఘా తీవ్రం చేయడంతో గతేడాది నుంచి ఇసుక క్వారీల్లో ఎక్స్‌ట్రా బకెట్ దందాకు కాంట్రాక్టర్లు స్వస్తి పలికారు. స్వయాన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్వారీల్లో అదనపు బకెట్‌లు నడిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీరియస్‌గా హెచ్చరించారు. ఆ సమయంలో క్వారీల వద్ద మైనింగ్, రెవెన్యూ, పోలీసులతో మూడు షిప్టుల్లో నిఘాను తీవ్రతరం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఎక్స్‌ట్రా బకెట్‌లు నడపటం లేదు. దీంతో కొత్తగా క్వారీ కాంట్రాక్టర్లు తమకు ఆదాయం సన్నగిల్లిందనే సాకుతో క్వారీలకు వచ్చే లారీడ్రైవర్ల వద్ద ఒక్కో లారీకి లోడింగ్ చార్జీల పేరిట రూ.2వేల నుంచి రూ.3వేల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.
అంతా ఆన్‌లైన్‌లోనే..
ఇసుకకు ఆన్‌లైన్‌లో రూ.375 ఒక టన్నుకు చెల్లిస్తారు. అందులోనే లోడింగ్ చార్జీలు కూడా ఉంటాయి. ఈ డబ్బులు నేరుగా రాష్ట్ర టీజీఎండీసీ ఖాల్లోకి చేరుతాయి. ఇలా చెల్లించిన మొత్తం నగదును కాంట్రాక్టర్లకు లోడింగ్ చార్జీల కింద ప్రభుత్వం అందిస్తుంది. సకాలంలో ఆ చెల్లింపులు ఆలస్యం కావడంతో లారీ డ్రైవర్ల వద్ద కొత్త నాటకానికి తెరలేపి అక్రమంగా వేలల్లో లోడింగ్ చార్జీల పేరిట వసూలుకు పూనుకుంటున్నారు. ఇలా ఆన్‌లైన్‌లో చెల్లించిన మొత్తం, లారీ డైవర్ల వద్ద చెల్లించిన నగదు కాంట్రాక్టర్లకు చేరుతుండడంతో లారీల యజమానులు రెండు రకాలుగా నష్టపోతున్నామని వారం రోజుల కిందట టీజీఎండీ, ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేశారు. అప్పుడు కాస్త ఊరటనిచ్చి రూ.2వేల వరకు తీసుకోవాలని ఆదేశాలు అందజేశారని తెలిసింది.
ఈ విషయమై మహదేవపూర్ టీజీఎండీసీ పీఓ రామకృష్ణను ఫోన్‌ద్వారా సంప్రదించగా.. ఎలాంటి అధిక మొత్తం చార్జీలు తీసుకోవడం లేదని.. తన దృష్టికి రాలేదని తెలిపారు.
మేడారం వచ్చే భక్తులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఎంజీఎం సూపరింటెండెంట్ హరీశ్ చంద్రారెడ్డి పేర్కొన్నారు.
రూ.3వేల వరకు లోడింగ్ పేరిట వసూలు చేస్తుండడంతో అక్రమంగా రూ.లక్షల్లో పక్కదారి పడుతుందని ఆరోపణలు ఉన్నాయి. 300లారీలకు ఒక రోజుకు రూ.9లక్షల వరకు పక్కదారి పడుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో కొంత మంది ఇస్తుండడం, మరి కొంతమంది ఇవ్వకపోవడంతో గొడవలు జరుగుతున్నాయి. లోకల్ లారీల వద్ద కొంత తక్కువగా తీసుకుంటున్నారని తెలిసింది. ఎవరైనా అధికారులు తనిఖీలకు వస్తే ముందస్తుగానే తెలుసుకొని లోడింగ్ చార్జీలు నిలిపివేస్తున్నట్లు తెలిసింది. ఇంత జరుగుతున్నా సంబంధిత టీజీఎండీసీ, మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
సీఎం ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూనే కాంట్రాక్టర్లు టీజీఎండీసీ కనుసన్నల్లోనే లోడింగ్ చార్జీల వసూలుకు నడుం బిగించారు. గతంలో ఎక్స్‌ట్రా బకెట్‌కు రూ.4వేల నుంచి 6వేల వరకు వసూలు చేసిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం ఒక్క కిలో ఇసుక కూడా అదనంగా తరలిపోకుండా జాగ్రత్తలు పడుతున్నారు. నిఘా తీవ్రంగా ఉండడంతో అనుమానాలు లేకుండా ముక్కుపిండి మరీ డ్రైవర్ల వద్ద లోడింగ్ పేరిట రూ.2వేల నుంచి 3వేల వరకు దర్జాగా వసూలు చేస్తున్నారు. మహదేవపూర్ మండలంలో మూడు క్వారీల్లో బొమ్మాపూర్, పలుగుల, పూస్కుపల్లి క్వారీల్లో నిత్యం మూడు వందలకు పైగా వరకు లారీలు ఇసుక లోడింగ్ జరుగుతుంది.
శనివారం శ్రీ 3 శ్రీ జనవరి శ్రీ 2026
శనివారం శ్రీ 3 శ్రీ జనవరి శ్రీ 2026
శనివారం శ్రీ 3 శ్రీ జనవరి శ్రీ 2026
శనివారం శ్రీ 3 శ్రీ జనవరి శ్రీ 2026


