మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు | - | Sakshi
Sakshi News home page

మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు

Jun 18 2025 3:43 AM | Updated on Jun 18 2025 3:43 AM

మైనర్

మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు

కాటారం డీఎస్పీ సూర్యనారాయణ

కాటారం: మైనర్లకు వాహనాలు ఇచ్చి పనులు చేపిస్తే సదరు వాహన యజమానులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ హెచ్చరించారు. కాటారం మండలం మేడిపల్లి పరిధిలోని బస్వాపూర్‌కు చెందిన బాలుడు మంగళవారం ట్రాక్టర్‌తో పని చేస్తుండగా పోలీసులు గుర్తించారు. ట్రాక్టర్‌ యజమాని వెన్నపురెడ్డి సమ్మయ్య, ట్రాక్టర్‌పై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి డ్రైవింగ్‌ చేయించడం, పనులు చేయించడం నేరమన్నారు. అలాంటి వారిని ఉపేక్షించబోమని పేర్కొన్నారు. మైనర్లతో పనులు చేయిస్తే బాలకార్మిక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని డీఎస్పీ హెచ్చరించారు. వాహనాల యజమానులు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు.

రామప్పను సందర్శించిన కుడా చైర్మన్‌

వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని మంగళవారం వరంగల్‌ కుడా చైర్మన్‌ ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా ఆలయ పూజారి హరీశ్‌ శఽర్మ తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్‌ విజయ్‌కుమార్‌ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు.

మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు
1
1/1

మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement