
లీకేజీలు.. పట్టవా..!
భూపాలపల్లి మున్సిపల్ పరిధి రెడ్డికాలనీ, పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ప్రాంతం, బీఆర్ఎస్ కార్యాలయ ప్రాంతం, హనుమాన్‌నగర్, కృష్ణకాలనీతో పాటు పలు ప్రాంతాల్లో మిషన్ భగీరథ పైపులైన్లు, గేట్ వాల్స్ నుంచి నీరు లీకేజీ అవుతుంది. ఈ పరిస్థితి జిల్లాకేంద్రంలో నెలల తరబడి నుంచి కొనసాగుతోంది. లీకేజీలతో సమస్య తీవ్రంగా ఉందని వాటర్ సప్లై సిబ్బందికి తెలిసినప్పటికీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం లేదు. మరమ్మతులు చేయాలని కాలనీవాసులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం లేదు. అధికారులు సైతం నామమాత్రంగా పర్యటించి చేతులు దులుపుకుంటున్నారు. వేసవి కాలం కావడంతో తాగునీటి సమస్య తలెత్తకముందే లీకేజీలను అరికట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. – భూపాలపల్లి అర్బన్

లీకేజీలు.. పట్టవా..!

లీకేజీలు.. పట్టవా..!