కాళేశ్వరం: ఉపాధి పనుల్లో కూలీలకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. బుధవారం మహదేవపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామపంచాయతీ, రెవెన్యూ సిబ్బంది, ఉపాధిహామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ వేసవికాలం సమీపించినందున తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఉపాధిహామీ పథకంలో ఆర్థిక సంవత్సరానికి లేబర్ బడ్జెట్ అప్రూవ్ చేసిన పని టార్గెట్‌గా పెట్టుకోవాలన్నారు. కూలీల దినసరి వేతనం రూ.300 లభించేవిధంగా మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్‌లు ముందస్తుగా కొలతల ప్రకారం పని చేయించాలని ఆదేశించారు. మెట్‌పల్లి, మహదేవపూర్, కాళేశ్వరం అంబట్‌పల్లిలో ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఈనెలాఖరు వరకు 25శాతం రుసుము రాయితీతో చెల్లించాలన్నారు. పంచాయతీల్లో ఇంటి పన్ను వందశాతం పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌పీఓ వీరభద్రయ్య, తహసీల్ధార్ ప్రహ్లాద్‌రాథోడ్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంపీఓ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ విజయలక్ష్మి


