● విత్తన మేళాలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
పాలకుర్తి: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి దిగుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. అధికారులు సూచించిన పంటలు, వరి రకాలనే వేయాలని సూచించారు. మంగళవారం రైతు వేదికలో నిర్వహించిన విత్తనమేళా కార్యక్రమంలో ఏడు రకాల వరి విత్తనాలు, కూరగాయలు విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూరగాయలు, వరి పంటలతో రైతులు దిగుబడి పెంచాలన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ అపర్ణ, ఎంపీడీఓ వేదవతి, సర్పంచ్ విజయ, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు రాపాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, మల్లారెడ్డి, పులి గణేష్, ఏఓ టెక్నికల్ నిర్మల్, ఏఓ విద్యాధర్, హార్టికల్చర్ అధికారి సంతోషిణి రాణి, క్లస్టర్ అధికారి లాలు పాల్గొన్నారు.
విద్యార్థుల సంక్షేమానికి కృషి
పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలోని తెలంగాణ సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలో స్టోర్ రూం, భోజనశాల, వంట గది, తరగతి గదులను పరిశీలించారు.


