జిల్లాలోని ప్రతీ ఇంటికీ బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు) వెళ్లి ముందు గానే ముద్రించిన ఎన్యుమరేషన్ ఫారాలను అందజేసి, వివరాలు సరిచూసుకుని తిరిగి సేకరించనున్నారు. పాత ఓటరు వివరాలు, కుటుంబ లింకులు, చిరునామా మార్పులు, కొత్తగా 18 ఏళ్లు నిండిన వారి నమోదు వంటి అంశాలు ఈ సర్వేలో కీలకం కానున్నాయి. ఫారం తీసుకుని తిరిగి సమర్పించకపోతే, లేదా వివరాల్లో లోపాలు ఉంటే ముసాయిదా జాబితాలో పేరు కనిపించకపోవచ్చనే ఆందోళన ఉంది. ముఖ్యంగా వలస వెళ్లిన కుటుంబాలు, అద్దె ఇళ్లలో ఉండేవారు, కొత్త ఓటర్లు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలి.


