● డీసీపీ రాజమహేంద్రనాయక్
జనగామ: మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి విద్యార్థులు చదువుపై దృష్టి సారించి సమాజ మార్గదర్శకులుగా ఎదగాలని జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్ పిలుపునిచ్చారు. సోమవారం ధర్మకంచ జెడ్పీహెచ్‌ఎస్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై జరిగిన అవగా హన కార్యక్రమంలో సీఐ సత్యనారాయణరెడ్డితో కలిసి డీసీపీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల విని యోగం యువత భవిష్యత్తు, ఆరోగ్యం, కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, ప్రతీ విద్యార్థి తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల్లో అవగాహన కల్పించి మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు ఉన్నారు.


