న్యూస్‌రీల్
‘నీట్’ ప్రశాంతం
విద్యార్థులను తనిఖీ చేస్తున్న అధికారులు
పరీక్ష కేంద్రంలో హాల్ టికెట్ నంబర్‌ను చూసుకుంటున్న విద్యార్థులు
జనగామ రూరల్: జిల్లా కేంద్రంలోని రెండు పరీక్ష కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, వైద్య శిబిరం వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్ ప్రకారం నిషేధాజ్ఞలు విధించారు. జిల్లాలో మొత్తం రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 588 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 509 మంది పరీక్షకు హాజరు కాగా 79 మంది గైర్హాజరు అయ్యారు. సిద్ధిపేట రోడ్డులోని ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల (అటానమస్), జనగామ మండలం పెంబర్తి లోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఏబీవీ డిగ్రీ కళాశాలలో 396 మందికి గాను 339 మంది పరీక్షకు హాజరు కాగా 57 మంది గైర్హాజర్ అయ్యారు. అలాగే పెంబర్తి ఎంజేపీలో 192 మందికి గాను 170 మంది హాజరు కాగా 22 మంది గైర్హాజరు అయ్యారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ బీంశర్మ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష జరిగింది.
విస్తృత తనిఖీలు
నీట్ పరీక్షకు హాజరైయ్యే విద్యార్థులను పోలీసులు, అధికారులు తనిఖీలు చేపట్టిన తర్వాత పరీక్షా హాల్‌కు అనుమతినిచ్చారు. నీట్ పరీక్ష రెండవ సారి నిర్వహిస్తుండడంతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కాగా నిమిషం నిబంధన అమలులో ఉండగా ఏబీవీ డిగ్రీ కళాశాల సెంటర్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో వెనుదిరిగి వెళ్లారు. అలాగే అశ్విని అనే విద్యార్థిని ఎంజేపీలో పరీక్ష రాయాల్సి ఉండగా ఏబీవీ డిగ్రీ కళాశాలకు వచ్చింది. విధుల్లో ఉన్న ఎస్‌ఐలు భారత్, సతీష్, చెన్నకేశవులు వెంటనే స్పందించి ఈ విషయాన్ని డీసీపీ రాజమహేంద్ర నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన డీసీపీ ఆలస్యం చేయకుండా పోలీస్ వాహనంలో ఎంజీపీ సెంటర్‌కు తరలించాలని ఆదేశించడంతో వారు సకాలంలో పరీక్ష సెంటర్‌కు చేర్చారు. ఏసీపీ భీమ్‌శర్మ, ఎస్‌హెచ్‌ఓలు సత్యనారాయణరెడ్డి, అబ్బయ్య, పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును పర్యవేక్షించారు.
79 మంది విద్యార్థులు గైర్హాజరు
సమయం మించిపోవడంతో
వెనుదిరిగిన ముగ్గురు విద్యార్థులు
పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు


