● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ
జనగామ రూరల్: కక్షిదారులు తమ కేసులను సామరస్యంగా పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ అన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. న్యాయవాదులు, బ్యాంక్ ఆఫీసర్స్, బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసర్స్, చిట్ ఫండ్స్ మేనేజర్స్ కక్షిదారులతో కేసుల పరిష్కారం కోసం రాగా ప్రధాన న్యాయమూర్తి లోక్ అదాలత్‌ను ప్రారంభించి మాట్లాడుతూ కక్షిదారులుమ సమస్యలను పెంచుకోకుండా రాజీమార్గమే రాచమార్గమన్నారు. లోక్ అదాలత్‌లో 5 బెంచ్‌ల ద్వారా కేసులను పరిష్కరించారు. మొత్తం 1,831 కేసులకు రూ.1,17,77,475 వచ్చినట్లు వారు తెలిపారు. ఆయా బెంచ్‌లలో న్యాయవాదులు కె.సునీతరాణి, జి.కవిత, శశి, మేకల స్వప్న, సందీప్, జ్యోత్స్న, శివలీల, పుష్పతో పాటు డీసీపీ రాజమహేంద్రనాయక్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బండ దయాకర్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.


