యోగాతో ఒత్తిడికి చెక్‌ | - | Sakshi
Sakshi News home page

యోగాతో ఒత్తిడికి చెక్‌

Jun 21 2026 12:49 AM | Updated on Jun 21 2026 12:49 AM

జనగామ: భారతదేశం ప్రపంచానికి అందించిన అ మూల్యమైన వరం యోగా. ఇది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు.. శరీరం, మనస్సు, ఆ త్మ మధ్య సమతుల్యతను నెలకొల్పే సంపూర్ణ జీవన విధానం. నేటి వేగవంతమైన, ఒత్తిడితో కూడిన జీవనశైలిలో యోగా ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోంది. యోగాభ్యాసం ద్వారా శారీరక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, భావోద్వేగ స్థిరత్వం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంలో..

నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంలో యోగా ఎంతో ప్రభావవంతంగా పని చేస్తుంది. అంతేకాదు మధుమేహం, రక్తపోటు, ఊ బకాయం వంటి అనేక జీవనశైలి వ్యాధులను నివా రించడంలోనూ, నియంత్రించడంలోనూ యోగా కీ లక పాత్ర పోషిస్తోంది. అందుకే అంతర్జాతీయ యో గా దినోత్సవం యోగా యొక్క విశ్వవ్యాప్త ప్రయోజనాలను గుర్తు చేస్తూ, ప్రతిఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సందేశం ఇస్తోంది. ఒక భూమి–ఒక ఆరోగ్యం అనే లక్ష్యాన్ని సాకారం చేయడంలో యోగా అత్యంత శక్తివంతమైన సాధనంగా నిలుస్తోందని యోగా అభ్యాసకులు సూచిస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా..

యోగా దినోత్సవం పురస్కరించుకుని విద్యాసంస్థలు, యోగా శిక్షణ కేంద్రాలు, బతుకమ్మకుంటతో పాటు జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో యోగా దినో త్సవం జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కలెక్టరేట్‌లో యోగా దినోత్సవం

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశాల మేరకు జిల్లా వైద్యశాఖ, ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో నేడు (ఆదివారం) ఉదయం 6.30 గంటలకు జిల్లా స్థాయి యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి యోగా చేసేందుకు వచ్చే అన్ని వర్గాల ప్రజల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొని యోగాభ్యాసాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మల్లిఖార్జున్‌రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బజరంగ్‌ యోగా సంస్థాన్‌ ఫౌండర్‌ గీతేష్‌ బజాజ్‌ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ రోజువారీగా కనీసం 30 నిమిషాలు యోగాభ్యాసం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రతీ ఇంటికి యోగా సందేశం

ఆరోగ్యకరమైన సమాజానికి పునాది

నేడు కలెక్టరేట్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement