ఉరుములు, మెరుపులు | - | Sakshi
Sakshi News home page

ఉరుములు, మెరుపులు

Jun 21 2026 12:49 AM | Updated on Jun 21 2026 12:49 AM

పాలకుర్తిలో భారీ వర్షం

పాలకుర్తి టౌన్‌: మండలకేంద్రంలో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు కమ్మి వర్షం కురవడంతో వాతావరణం చల్ల బడింది. మండలకేంద్రంలోని ఓ సూపర్‌మార్కెట్‌లో ఉరుములు, మెరుపుల కారణంగా సీసీ కెమెరాల చానల్‌ బాక్స్‌లో మంటలు చెలరేగా యి. వెంటనే షాపు యజమాని ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక కేంద్రం అధికారి శ్రీరాములు ఆధ్వర్యంలో సిబ్బంది అ క్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. అలాగే వర్షం కారణంగా సుమారు రెండు గంటలపాటు విద్యుత్‌ అంతరాయం కలగడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

రాజీవ్‌ చౌరస్తాలో కురుస్తున్న వర్షం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement