కొడకండ్ల: విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన సౌకర్యాలను కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తూ పర్యవేక్షించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. మండలకేంద్రంలోని కస్తూర్బా, మోడల్ స్కూల్స్‌ను శుక్రవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. తరగతి గదులు, మధ్యాహ్న భోజనం, పరిసరాలను పరిశీలించారు. సమస్యలుంటే నేరుగా తనకు ఫోన్ చేయాలని సూచిస్తూ తన ఫోన్ నంబర్‌ను వసతి గృహ ప్రాంగణాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, నాణ్యమైన భోజనాన్ని అందించాలని కలెక్టర్ చెప్పారు. విద్యార్థుల సంక్షేమానికే అన్ అకాడమీ తరగతులను ప్రారంభిస్తున్నామన్నారు. గణిత బోధనపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కోరారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసిన అనంత రం మోడల్ స్కూల్‌లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జీసీడీఓ గౌసియాబేగం, తహసీల్దార్ అనీల్‌బాబు, ఎంపీడీఓ శంకర్, సర్పంచ్ దూలం మమతసతీష్‌గౌడ్, ఎంఈఓ కేజీయారాణి, ప్రిన్సిపాల్ భానుప్రసాద్, ఎస్‌ఓ జ్యోతి ఉన్నారు.
లక్ష్యానికి అనుగుణంగా
అధికారులు పనిచేయాలి
కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా


