మున్సిపాలిటీ ప్రక్షాళనకు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీ ప్రక్షాళనకు శ్రీకారం

Jun 19 2026 1:00 AM | Updated on Jun 19 2026 1:00 AM

వార్డు వారీగా కేటాయించిన అధికారుల వివరాలు..

అధికారులకు బాధ్యతల కేటాయింపు ఇలా..

వార్డు వారీగా కేటాయించిన అధికారుల వివరాలు..

జనగామ: జనగామ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నూతన కమిషనర్‌ చిమ్ముల రాజశేఖర్‌రెడ్డి ప్రక్షాళన చర్యలకు శ్రీకారం చుట్టారు. వార్డు ఆఫీసర్లు, రెవెన్యూ సిబ్బంది, ఇతర శాఖల అధికారుల బాధ్యతలను పునర్‌వ్యస్థీకరించి కొత్త విధులు అప్పగించారు. ఆస్తి పన్ను వసూళ్లు, ట్రేడ్‌ లైసెన్సులు, పారిశుద్ధ్యం, ప్రజాసేవల పర్యవేక్షణలో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆదేశించారు. ప్రతీ అధికారి తనకు కేటాయించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పురపాలిక మార్పులకు ముందడుగు..

మున్సిపాలిటీలో ప్రజా సమస్యల పరిష్కారం, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాలు, తాగునీటి సరఫరా, డ్రెయినేజీ వ్యవస్థ, పన్నుల వసూళ్లు తదితర సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు 30 వార్డులకు ప్రత్యేకంగా వార్డు అధికారులను నియమిస్తూ కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి స్పెషల్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. ప్రతి వార్డులో ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వెంటనే పరిష్కరించడం, పరిశుభ్రత, నీటి సరఫరా, డ్రెయినేజీ, వీధి దీపాల నిర్వహణ, పన్నుల వసూళ్లు, హౌసింగ్‌, పట్టణ సేవల పర్యవేక్షణ బాధ్యతలను ఆయా అధికారులకు అప్పగించారు. అలాగే ఫిర్యాదుల స్వీకరణ, సమస్యల పరిష్కారంపై నిరంతర పర్యవేక్షణ, సంబంధిత విభాగాలతో సమన్వయం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా అధికారులను నియమించినట్లు కమిషనర్‌ తెలిపారు. వార్డు అధికారులు తమకు కేటాయించిన వార్డుల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉండాలని, ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వార్డు స్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ఈ నియామకాల ప్రధాన ఉద్ధేశమని కమిషనర్‌ చెబుతున్నారు.

వార్డు ఆఫీసర్లు, శాఖల అధికారులకు

కొత్త బాధ్యతలు

అధికారుల పర్యవేక్షణపై నిత్యం నిఘా

వార్డు స్థాయిలో సమస్యల

పరిష్కారంపై కమిషనర్‌ దృష్టి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement