వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో 23 మంది ఎస్సైలను బదిలీ చేస్తు పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్.మౌనిక సుబేదారి మహిళా పోలీస్‌స్టేషన్ నుంచి కాజీపేట పీఎస్, ఎస్.కిరణ్మయి సీసీఆర్‌బీ నుంచి హనుమకొండ భరో సా కేంద్రం, సీహెచ్ లలిత సీపీటీసీ నుంచి జనగామ భరోసా కేంద్రం, తౌటం శ్రావణి పీసీఆర్ నుంచి కేయూసీ, డి.నిహారిక పీసీఆర్ నుంచి మిల్స్‌కాలనీ, వి.భవాని వీఆర్ నుంచి ఇంతేజా ర్‌గంజ్ పీఎస్, తుమ్మ శ్రావణి వీఆర్ నుంచి మి ల్స్‌కాలనీ పీఎస్‌కు బదిలీ అయ్యారు. ఎన్.సాయిదివ్య వీఆర్ నుంచి హనుకొండ పీఎస్, కె.లక్ష్మీ వీఆర్ నుంచి సుబేదారి పీఎస్, బి.హరికృష్ణ సీపీటీసీ నుంచి సుబేదారి, సీహెచ్ రఘుపతి వీఆర్ నుంచి పరకాల పీఎస్, గోవర్ధన్ వీఆర్ నుంచి ఏనుమాముల పీఎస్, ఎస్.రాజన్‌బాబు వీఆర్ నుంచి నర్సంపేట పీఎస్, బి.రవీందర్ వీఆర్ నుంచి గీసుకొండ పీ ఎస్, ఎల్.కొంరెల్లి హనుమకొండ ట్రాఫిక్ నుంచి సీసీఆర్‌బీకి బదిలీ అయ్యారు. ఎన్.రవికిరణ్ ఇంతేజార్‌గంజ్ పీఎస్ నుంచి సీఎస్‌బీ, ఎస్. వెంకన్న సుబేదారి నుంచి సీఎస్‌బీ, షేక్ జాన్‌పాషా ధర్మసాగర్ నుంచి సీఎస్‌బీ, వి.నవీన్‌కుమార్ కాజీపేట పీఎస్ నుంచి సీఎస్‌బీ, బి.చందర్ టాస్క్‌ఫోర్స్ నుంచి సీసీఎస్, ఎం.రమేశ్ పరకాల నుంచి సీసీఆర్‌బీ, ఎల్.నరేశ్ మిల్స్ కాలనీ నుంచి సీసీఆర్‌బీ, పి.శ్రీనివాస్‌ను ఐనవోలు నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎం కార్యక్రమాన్ని
తిలకించిన కలెక్టర్
జనగామ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం గుర్రంగూడ ఎకో పార్క్‌లో గురువారం నిర్వహించిన వనమహోత్సవాన్ని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి, అధికారులు, విద్యార్థులతో కలిసి కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా లైవ్ ద్వారా తిలకించారు. అనంతరం జిల్లాలో వన మహోత్సవాన్ని కలెక్టర్ ప్రారంభించారు.
పిల్లల సంరక్షణ, విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
జఫర్‌గఢ్: ఆశ్రమ పిల్లల సంరక్షణ, విద్య, ఆరోగ్య భద్రత విషయంలో మరింత శ్రద్ధ వహించాలని అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్ కోరారు. మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీతండా వద్ద ఉన్న మా ఇల్లు ప్రజాధరణ అనాథ శ్రమాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వహణ, రికార్డులు, ఇతర పత్రాలను పరిశీలించడంతోపాటు పిల్లల బాగోగులను అడిగి తెలుసుకుని సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పిల్లలు కష్టపడి చదువుకొని ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు గాదె పుష్పరాణి, ఆశ్రమ పిల్లలు పాల్గొన్నారు. అంతముందు అడిషనల్ కలెక్టర్ బెన్‌షాలోమ్.. జఫర్‌గఢ్ రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించడంతోపాటు కార్యాలయం వద్ద వర్షపాతం నమోదు (రెయిన్ గేజ్) కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్‌తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు
నాణ్యతగా చేపట్టాలి
జనగామ: జనగామ పట్టణం హైదరాబాద్ రోడ్డులో జరుగుతున్న అభివృద్ధిలో భాగంగా సెయింట్ మేరీస్ స్కూల్ ఏరియాలోని పనులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హైదరాబాద్ మెచిన్ రోడ్డు నుంచి గార్లకుంట, సూర్యపేట రోడ్డు వరకు రూ.9.10కోట్లతో వరదల కాల్వ పనుల పురోగతిని పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. సెయింట్ మేరీస్ స్కూల్ వద్ద చేపట్టిన వరద నీటి కాల్వ పనులను 35 నుంచి 40 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఇదే సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతాచర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.


