బచ్చన్నపేట: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలను పెంచాలని, ఓపీ పెరిగేలా చూడాలని డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని గురువారం ఆయన సందర్శించారు. ఆస్పత్రిలో రోగులతో మాట్లాడి, ల్యాబ్, ఫార్మసీని, ఆన్‌లైన్ విధానాన్ని, మందుల స్టాక్ వివరాల రిజిస్టర్, ఆపరేషన్ థియేటర్ పరిశీలించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. ఆస్పత్రిలో వెసెక్టమీ ఆపరేషన్లను పెంచాలని ఆ ఆపరేషన్‌లకు తానే స్వయంగా వచ్చి చేస్తానని చెప్పారు. అలాగే సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా చూడాలని, ఆస్పత్రికి వచ్చే రోగులకు భరోసా కల్పించాలన్నారు. రాబోవు వర్షాకాలంలో వచ్చే జబ్బుల గురించి ప్రజలకు అవగాహన కలించాలన్నారు. నీటి కలుషితం లేకుండా చూడాలని, ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తలు పాటించా లన్నారు. కార్యక్రమంలో ప్రోగామ్ జిల్లా అధికారులు లగిషెట్టి అశోక్‌కుమార్, కమలహాసన్, మండల వైద్యులు సృజన, ప్రసన్న కృష్ణ, మానస, సిద్ది సుదర్శన్‌రెడ్డి, సీహెచ్‌ఓ జంగమ్మ, సూపర్‌వైజర్లు, హెడ్ నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు.


