ఉన్నా.. లేనట్టే..! | - | Sakshi
Sakshi News home page

ఉన్నా.. లేనట్టే..!

Jun 19 2026 1:00 AM | Updated on Jun 19 2026 1:00 AM

జనగామ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో సెంట్రల్‌ లైటింగ్‌ లేకపోవడంతో చీకటిగా మారిన రోడ్లు

జనగామ: పట్టణంలోని హైదరాబాద్‌, హనుమకొండ, సిద్దిపేట రోడ్‌, నెహ్రూ పార్క్‌ ఏరియా, ఫ్లైఓవర్‌ బ్రిడ్జి, సూర్యాపేట రోడ్లపై సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం పనిచేయడం లేదు. కొన్నిచోట్ల లైట్లు పూర్తిగా వెలగకపోవడం, మరికొన్ని చోట్ల సగం మాత్రమే వెలుగుతుండగా కొన్ని డిమ్‌గా వెలగడంతో రాత్రివేళ రహదారులు చిమ్మచీకటిగా మారుతున్నాయి. దీంతో ఆ మార్గాల్లో వెళ్లే ప్రజలు భయాందోళనతో ప్రయాణాలను సాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మున్సిపల్‌ అధికారులు స్పందించి లైటింగ్‌ సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement