ఆర్ట్స్‌ కళాశాల డిగ్రీ సెమిస్టర్‌ ఫలితాల విడుదల | - | Sakshi
Sakshi News home page

ఆర్ట్స్‌ కళాశాల డిగ్రీ సెమిస్టర్‌ ఫలితాల విడుదల

Jun 19 2026 1:00 AM | Updated on Jun 19 2026 1:00 AM

కేయూ క్యాంపస్‌: యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల (అటానమస్‌) డిగ్రీ నాలుగు, ఆరో సెమి స్టర్‌ పరీక్షల ఫలితాలను కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ ఎస్‌.జ్యోతితో కలిసి గురువారం విడుదల చేశారు. నాలుగో సెమిస్టర్‌ పరీక్షలకు 1,030 మంది విద్యార్థులు హాజరుకాగా 573 మంది విద్యార్థులు (55.63 శాతం)ఉత్తీర్ణులయ్యారు. ఆరో సెమిస్టర్‌ పరీక్షలకు 663 మంది హాజరుకాగా 398 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ప్రిన్సిపాల్‌ జ్యోతి తెలిపారు. కేయూ ఓఎస్‌డీ వెంకట్రాంరెడ్డి, ఓయూ మాజీ వీసీ సత్యనారాయణ, ఏవీఎస్‌ ప్రసా ద్‌, అనిల్‌కుమార్‌, కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ రహమాన్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ శ్రీలత, వివిధ విభాగా ల అధిపతులు రుక్కిరెడ్డి ఆదిరెడ్డి, శ్రీధర్‌కుమార్‌లోథ్‌, భిక్షపతి, హరికుమార్‌, స్వామి, ప్రసాద్‌, చందూలాల్‌, జయప్రకాశ్‌, ప్రసాద్‌, రమేశ్‌, విజయ్‌కుమార్‌, నాగయ్య, సతీశ్‌, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement